KRNL: ఆదోని మండలం నాగలాపురంలో శుక్రవారం హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ముచ్చిగిరి రాజగోపాల్-మీనాక్షి దంపతుల ఏకైక కూతురు సింధూర వారి నివాసంలోనే పాము కాటుకు గురైంది. తల్లి అప్రమత్తమై వెంటనే చిన్నారిని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం పాప మృతి చెందినట్లు చెప్పారు. ఏకైక కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.