SKLM: ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామ పంచాయతీలో శుక్రవారం మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరావు అధ్యక్షతన టీడీపీ క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.