CTR: సదుం మండలంలోని అమ్మగారిపల్లె పంచాయతీ సీతమ్మగుట్ట వద్ద ఎస్టీ కాలనీకి తాగునీటి సమస్య తీరింది. తాగునీటి సమస్యపై గతంలో స్థానికులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. వారి సూచనల మేరకు శుక్రవారం పంచాయతీ నిధులతో అధికారులు శాశ్వత పైప్ లెన్ ఏర్పాటు చేసినట్లు ప్రజలు తెలిపారు.