TG: మేడ్చల్ జిల్లా కీసరలో గాలిపటం మాంజాతో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న జశ్వంత్‌రెడ్డి మెడకు మాంజా చుట్టుకుంది. దీంతో మెడపై తీవ్రగాయం కావడంతో స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు 19 కుట్లు వేశారు. సంక్రాంతి నేపథ్యంలో కీసరలో దొంగచాటుగా నిషేధిత మాంజా విక్రయాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపించారు.