RR: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మొగలిగిద్ద గ్రామ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం మొగలిగిద్ద నూతన సర్పంచ్ బుగ్గ కృష్ణ, ఉపసర్పంచ్ రాము, వార్డు సభ్యులు ఎమ్మెల్యేను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సమస్యలను వివరించగా, అభివృద్ధికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.