PDPL: సింగరేణి యాజమాన్యం అన్నింటిలోనూ దుబార ఖర్చులను తగ్గించాలని జిల్లా సీఐటీయూ నాయకులు హితవు పలికారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటున్నామని ఆవిర్భావ వేడుకలకు నిధులను తగ్గించిన యాజమాన్యం మేస్సీ కార్యక్రమానికి, ఇతర కార్యక్రమాలకు ఇచ్చినప్పుడు సోయి ఎక్కడుందన్నారు. ఆవిర్భావ వేడుకలకు ఆశించిన మేర నిధులు కేటాయించకపోవడంపై కార్మిక వర్గం అసహనంతో ఉందని అన్నారు.