GNTR: మున్సిపల్ కార్మికుల సమ్మె కాలపు వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎర్రబాలెంలో MTMC కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. CITU నాయకులు మాట్లాడుతూ.. గత ఏడాది డిసెంబర్ 26న తాము చేపట్టిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించాలన్నారు.