E.G: జిల్లాలో 3.01 లక్షల పాడి పశువులుండగా, ఎండుగడ్డి కొరత తీవ్రమవుతోంది. ఐ.పంగిడి రిలయన్స్ ఎనర్జీ ప్లాంట్ వరి మోడును ముడిసరుకుగా వాడటంతో నిల్వలు తగ్గిపోతున్నాయి. యంత్రాల కోతతో గడ్డి వృధా అవుతుండగా, ఎకరా గడ్డి ధర రవాణా ఖర్చులతో కలిపి రూ.15 వేలకు చేరింది. దీంతో పశువులను పోషించడం పాడి రైతులకు భారంగా మారుతోంది.