జెన్ జీ యువతపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. జెన్ జీ యువత ఆత్మవిశ్వాసంతో అన్ని విషయాల్లో ముందడుగు వేస్తున్నారని కొనియాడారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో వారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేరవేరుస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. వీర్ బాల్ దివస్ సందర్భంగా బాలలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు.