నెల్లూరులోని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను శుక్రవారం సంగం మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకముగా కలిశారు. బీదా రవిచంద్రకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.