BHPL: మల్హరావు మండలం తాడిచెర్ల గ్రామ PACSలో రైతులు యూరియా బస్తాల కోసం పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు అధికారులకు ఇచ్చారు. అయితే రైతుల పత్రాలు పక్కన పారేసి, యాజమాన్యం దగ్గరి వారికే ఎరువు బస్తాలు అమ్ముతున్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు.