భద్రాచలంలో జీసీసీ స్టోర్ పక్కన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కబ్జాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.