ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా ప్రతినిధులను పోలీసులు లోనికి అనుమతించకుండా అడ్డుకోవడంతో వివాదం నెలకొంది .గమనించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ జోక్యం చేసుకుని, మీడియా మిత్రులను సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు.