KMR: ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రస్థాయిలో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్స్ సాధించి సీహెచ్. వివేక్ జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. అకాడమీలో ఉంటూ మంచి శిక్షణ పొందారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల పేరును జాతీయస్థాయిలో నిలిపారని చెప్పారు.