SKLM: మార్చి 1వ తేది నాటికి నూతన కలెక్టరేట్ భవనం సిద్ధం కావాలి అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అధికారులు ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన శుక్రవారం స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో సమీక్షించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని మంత్రి అన్నారు.