MBNR: కేంద్ర ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ గవర్నమెంట్ కౌన్సిల్ మెంబర్గా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది జి. శివకుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో విశేషంగా కృషి చేసిన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.