NLG: నల్లగొండ డీఈవో కార్యాలయం వద్ద తప్పిపోయిన బాలుడిని ట్రాఫిక్ పోలీసులు రక్షించి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ చిన్నారికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వెంటనే వన్ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.