PPM: సీతానగరం మండలం అంటిపేటలో ఎంపీడీవో MLN ప్రసాద్ శుక్రవారం ‘డ్రైడే -ఫ్రైడే’ కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని సూచించారు. కుళాయిలు, బోరింగుల దగ్గర, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని గ్రామస్థులకు ఆయన సూచించారు. నిల్వలు ఉండడం వలన అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు.