KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవాళ పాలేరు నియోజకవర్గంలో నిర్వహించాల్సిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొనాల్సి ఉండగా, వాయిదా పడినట్లు తెలిపారు.