ఖమ్మం నగర సమీపంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు వాగులో సుమారు మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.