KDP: బ్రహ్మంగారి మఠంలోని వివిధ ఆలయాల అభివృద్ధిపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాదులోని ఆయన కార్యాలయంలో జరిగిన సమావేశంలో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)పై చర్చించారు. ఈశ్వరి దేవి మఠం, పోలేరమ్మ ఆలయం తదితరాలను కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీమ్ ద్వారా రూ.50 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.