ELR: వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న సేవలకు గాను కొయ్యలగూడెంకు చెందిన రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షుడు హనుమంతరావు ‘రాష్ట్ర ఉత్తమ సేవా పురస్కారం’ అందుకున్నారు. విజయవాడలో జరిగిన జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా వినియోగదారుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన చొరవకు ఈ గుర్తింపు దక్కింది.