SRCL: రుద్రంగి మండల కేంద్రంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లమ్మ ఆలయం సమీపంలో అతివేగంగా వచ్చిన వాహనం ఢీ కొట్టడంతో రాములు, వనిత గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన వాహనం ఆగకుండా వేగంగా వెళ్లిపోయిందని వారు పేర్కొన్నారు.