VSP: చంద్రపాలెం జాతర గట్టు దుర్గాలమ్మను రాష్ట్ర శిల్పారామాల ఛైర్పర్సన్ మంజులారెడ్డి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ పెద్దలు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వారి వెంట మధురవాడ శిల్పారామాధికారి రమేష్‌రెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.