GNTR: డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవితక్కెళ్ళపాడులో గురువారం రాత్రి క్యాండిల్ ర్యాలీ జరిగింది. సౌత్ డీఎస్పీ భానోదయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను వీడియోల రూపంలో ప్రదర్శించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు జీవితాన్ని అంధకారం చేస్తాయని చెప్పారు.