GNTR: పెదకాకానిలోని ప్రఖ్యాతిగాంచిన శ్రీ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఆలయంలోని కానుకల హుండీలు లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ DC గోగినేని లీలా కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి దేవదాయ శాఖ అధికారి పర్యవేక్షణలో కానుకల హుండీలు తెరిచి ఆలయ కళ్యాణ మండపంలో లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.