కృష్ణ: తీరప్రాంత అభివృద్ధి అవకాశాలు యువతకు అందిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం కోడూరులో ప్రముఖ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీఎస్ఆర్ గ్రూప్ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు ఫోటోతో పోస్టల్ శాఖ ముద్రించిన పోస్టల్ స్టాంపును కొల్లు రవీంద్ర, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఆవిష్కరించారు.