AKP: అచ్యుతాపురంలో వంతెన నిర్మాణ పనులను రాష్ట్ర రహదారి అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బొందల శ్యామ్ గురువారం పరిశీలించారు. అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రాకపోకలకు ఇబ్బందులు కలక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.