KKD: సంక్రాంతి వస్తున్న నేపద్యంలో గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరం గ్రామంలో పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో కోడి పందాలు,పేకాట లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రజలంతా శాంతి భద్రతకు సహకరించి, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.