NTR: గంపలగూడెం మండలం ఊటుకూరు శివారులోని చింతలనర్వ మధిర రోడ్డు క్రాస్ వద్ద ఉన్న రోడ్డు గుంత ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహన చోదకులు ఈ గుంతలో పడి గాయపడే అవకాశం ఉందని గ్రామస్తులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి ఈ గుంతను వెంటనే పూడ్చాలని వారు కోరుతున్నారు.