కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ సావిత్రి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆమె శాలువాతో ఎంపీని సత్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 28న నంద్యాలలో నిర్వహించే రజక ఆకాంక్ష సభకు హాజరుకావాలని ఎంపీ నాగరాజును ఛైర్మన్ సావిత్రి ఆహ్వానించారు.