AP: మంత్రి సత్యకుమార్‌కు కేంద్ర మంత్రి జేపీ నడ్డా లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల ప్రాజెక్ట్ వ్యయంలో 80%, నిర్వహణలో 50% ఆర్థిక సాయం (VGF) అందుతుందని తెలిపారు. వచ్చే మూడేళ్ల ప్రాజెక్టులను వేగవంతం చేసి, కేంద్రంతో సమన్వయం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు.