PPM: జియ్యమ్మవలస మండలం పెదకుదమ గ్రామ సరిహద్దుల్లోకి ఏనుగులు గుంపు గురువారం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పంట పొలాలు నాశనం చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా గ్రామాల్లో తిరగవద్దని సూచించారు.