PLD: క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులందరికీ శంకరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తాళ్లచెరువు గ్రామంలోని బాల యేసు దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్, శంకర్రావుకు ఆశీర్వచనాలు అందించారు.