NLG: నల్లగొండ పట్టణంలోని సిద్ధార్థ కాలనీలో కోమటిరెడ్డి జ్యోతి-వెంకటరెడ్డి కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు. వారి కుమారుడు పవన్ రెడ్డి ఇటీవల అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి వారి నివాసానికి వెళ్లి, కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.