WGL: రాయపర్తి మండల కేంద్రంలోని గుబ్బడి తండాలో ఇవాళ బీటీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ గారె సహేంద్ర కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. తండవాసుల చిరకాల కోరిక నెరవేరుతుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను త్వరగా పూర్తి చేస్తామని, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.