W.G: ఇండియన్ పొటాష్ లిమిటెడ్‌కు చెందిన వెయ్యి టన్నుల యూరియా రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చిందని ఏడీఏ ఆర్. గంగాధరరావు తెలిపారు. ఇవాళ తాడేపల్లిగూడెం రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చిన యూరియాను ఆయన పరిశీలించారు. జిల్లాకు సంబంధించి వంద టన్నులు మార్క్ ఫెడ్, 200 టన్నులు ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు వివరించారు. రాబోయే 2 రోజుల్లో 3706 టన్నులు యూరియా రానుందన్నారు.