SKLM: నరసన్నపేటలోని ఓ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇవాళ హాజరయ్యారు. కేకు కట్ చేసి క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, క్షమ, త్యాగం, సేవా భావాలకు ప్రతీక అని అన్నారు. యేసుక్రీస్తు బోధనలు మానవాళికి శాంతి, సౌభ్రాతృత్వం మార్గాన్ని చూపుతాయని అన్నారు.