ఇటీవల ముగిసిన SMATలో జార్ఖండ్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని జార్ఖండ్ ఫైనల్లో హర్యానాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే జార్ఖండ్ విజేతగా నిలవడంలో ధోనీ కీలక పాత్ర పోషించినట్లు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం జాయింట్ సెక్రెటరీ షాబాజ్ నదీమ్ తెలిపారు. జార్ఖండ్ ప్లేయర్లకు ధోనీ మెంటర్‌గా విలువైన సూచనలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.