భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువతకు జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ అందిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. డిసెంబర్ 27న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరో ఎంపిక డ్రైవ్ నిర్వహించి 50 మందిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం నెలకు 13 వేల నుంచి 18 వేల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు.