KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేసిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల యుగేందర్ అన్నారు. గురువారం ఖమ్మం 40వ డివిజన్లో ఇందిరమ్మ ఇంటిని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ చౌదరితో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం పేదలను మోసం చేసిందని విమర్శించారు. పేదల శ్రేయస్సుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.