ఒడిశా అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక నేత గణేష్ ఉయికే మరణించాడు. ఇతని తలపై ఏకంగా రూ.1.10 కోట్లు రివార్డు ఉంది. గణేష్ తెలంగాణలోని నల్గొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందినవాడని పోలీసులు వెల్లడించారు. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ దళాలను నడిపిస్తున్న గణేష్ మృతి మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అధికారులు పేర్కొన్నారు.