GNTR: అమరావతిలోని వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని వాజ్ పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర మంత్రులు గురువారం ఆవిష్కరించారు. అనంతరం వాజ్ పేయి విగ్రహానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. మరి కాసేపట్లో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించనున్నారు.