SRD: కంగ్టి మండలం తుర్కవడగాం గ్రామంలో క్రిస్మస్ వేడుకలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పాల్గోని మాట్లాడుతు.. విశ్వ మానవాళికి తమ ప్రేమతత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు, ప్రేమ మూర్తి క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు మాజీ ఎంపీపీ దామ నాగన్న ఉన్నారు.