MBNR: అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమానికి ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలంతా కూడా దేవుడిపై నమ్మకాన్ని ఉంచి తమ దినసరి కార్యక్రమాలను కొనసాగించాలని పేర్కొన్నారు.