AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం గాంధీ విగ్రహం వద్ద ట్రాక్టర్ యజమానులు గురువారం నిరసన తెలియజేశారు. ట్రాక్టర్‌తో మట్టి, గ్రావెల్ తోలకాలు జరిపితే ఏఎంఆర్ సంస్థ అధిక వసూళ్లు చేస్తుందని అరికట్టాలంటూ నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ.. ఇల్లు నిర్మాణాలకు, వ్యవసాయ భూములకు కావలసిన మట్టి సరఫరా చేస్తే ఒక ట్రిప్పు మట్టి తోలకానికి అక్రమంగా వసూలు చేస్తున్నారన్నారు.