బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) నాయకురాలు, మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లో ఉంటున్న ఆమె తనయుడు తారిక్ రహమాన్ స్వదేశానికి తిరిగివచ్చారు. స్వీయ బహిష్కరణలో ఉన్న ఆయన.. తన కుటుంబంతో కలిసి దాదాపు 17ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు వచ్చారు. దీంతో ఢాకా ఎయిర్‌పోర్టులో BNP పార్టీ మద్దతుదారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.