E.G: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అని రాజమండ్రి MP పురందీశ్వరి అన్నారు. ఇవాళ రాజమండ్రి గోరక్షపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞుడని, అద్భుతమైన కవి అని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అందరూ గౌరవించే బహుముఖ ప్రజ్ఞాశాలి అని స్మరించుకున్నారు.