VZM: పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్గా అయ్యన్నపేటకు చెందిన పడాల జోగేష్ను టీడీపీ అధిష్ఠానం నియమించింది. తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిలకు జోగేష్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.