KMM: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ వైరా నియోజకవర్గం MLA మాలోతు రాందాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషులపై ప్రేమ, నిస్సహాయులపై కరుణ, శత్రువులపై క్షమ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత జీవనం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.